కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగు శక్తి లేఖ

 * కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగు శక్తి లేఖ


గోపాలపురం ఎస్సీ నియోజకవర్గాన్ని ఓసి నియోజకవర్గం గా మార్చాలని విజ్ఞప్తి

విశాఖలోని భూదందాలపై సిబిఐ చే విచారణ జరిపించాలి

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోమంత్రికి తెలుగు శక్తి విజ్ఞప్తి

తనకు ప్రాణభయం ఉందని తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి 

--- తెలుగు శక్తి అధ్యక్షుడు    బి.వి.రామ్

భీమిలి వి న్యూస్ 2022 డిసెంబర్ 05:

గోపాలపురం ఎస్సీ నియోజకవర్గాన్ని ఓసి నియోజకవర్గం గా మార్చాలని తెలుగు శక్తి అధ్యక్షుడు          బి.వి.రామ్.. కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఒక లేఖను సమర్పించారు.1952 నుంచి గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంగా  కొనసాగుతుందన్నారు.  గోపాలపురం సమీపంలోని కొవ్వూరు, ఆచంట, చింతలపూడి తదితర ఓసి నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలుగా మారాయన్నారు. అయినప్పటికీ దాదాపు 7 దశాబ్దాలుగా గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంలోని కొనసాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గోపాలపురం ఎస్సీ నియోజకవర్గాన్ని  ఓసి నియోజకవర్గంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి కార్యాలయాలకు లేఖలను అందజేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల పేరిట అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా విశాఖలో భూదందాలు అధికమయ్యాయని, అక్రమాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదని వెంటనే అత్యవసర పరిస్థితి విధించాలన్నారు. ఇలా ఉండగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న తనపై అధికార వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. గత నెల 16వ తేదీన మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరుడి నంటూ ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారన్నారు. ఈ విషయమే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు ఎంఏపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో తనకు ప్రాణం ఉందని .. తగిన రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోమంత్రికి బి.వి.రామ్ విజ్ఞప్తి చేశారు.