స్నేహానికి నిలువెత్తు నిదర్శనం ఏయు హై స్కూల్ విద్యార్థులు...
విశాఖ ఈస్ట్ వి న్యూస్ 2022 డిసెంబర్ 11
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకే కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏ ఐక్యత లేక కుటుంబంలో ఒకరికి ఏమైనా జరిగినా మాకెందుకులే అనే ప్రస్తుతం ఉన్న కాలంలో జీవిస్తున్నా మనుషుల్లో కొద్దో గొప్పో ఇంకా మంచితనం ఉందని కొందరి ద్వారా సమాజానికి తెలుస్తోంది.
స్నేహమంటే ఒకే కంచం ఒకే మంచమే కాదు అలాగే దోస్త్ మేరా దోస్త్ తుహే నా ప్రాణం అన్న ఒక సినిమా పాటకి నిర్వచంగా దోస్త్ కి ఆపద వస్తే మేమున్నాము అంటూ ముందుకు వచ్చింది స్నేహం రూపంలో 2002-03వ సంవత్సరంలో చదివిన ఆత్మీయుల బృందం. ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్ లో పదవ తరగతి చదివిన విద్యార్థుల్లో కామేష్ అనే స్నేహితుడికి ఆరోగ్య పరిస్థితి బాలేదని ఒక స్నేహితుడు ద్వారా తెలుసుకున్న మిగతా స్నేహితులందరూ స్నేహానికి విలువిచ్చి అందరూ ఐక్యమత్యంగా ముందుకు వచ్చి విశాఖపట్నంలో చిన్నవాల్టర్ లో నివసిస్తున్న కామేష్ స్వగృహము కెళ్ళి తనని పరామర్శించి ఆ స్నేహితుడికి మేమున్నాము అంటూ భరోసా ఇస్తూ తనకి కావలసినవి కొంతమేర స్నేహితులు సహకారంతో నగదు రూపంలో సహాయం చేసి తనకి ధైర్యాన్ని చెప్పారు చిన్న నాటి స్నేహితులు.
అలాగే నీకు ఏమి కావాలన్నా ముందుగా మాకు తెలుపండి స్నేహితులము మేము ఉన్నాము అని ఆ కుటుంబానికి తన స్నేహితుడుకి కూడా ఒక ధైర్యాన్ని కల్పిస్తూ భరోసానిచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ హైస్కూల్ 2002-03వ సంవత్సరం
విద్యార్థులు...


