జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక.
ఎంపికైన క్రీడాకారులుకు అభినందనలు తెలిపిన,జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ మహంతి.
మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 07
విశాఖ గీతంయూనివ్సిటీ ఇండోర్ స్టేడియంలో జూన్25 నుంచి28 వరకు జరిగిన7వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ తరుపు నుంచి ప్రాతినిద్యం వాయించిన వారిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఎంపిక చేయడంజరిగింది.అందులో విశాఖపట్నం నుంచి బాలుర విభాగంలో లొపి.లీలా కుమార్ కె.కార్తికేయ గణపతినాయుడు, సైఫ్ఉల్ల బాలిక విభాగం లో కే.సుమిత్ర, వై.హేమలత హేమ వున్నారు.
ఎంపికైన క్రీడాకారులను జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ మహంతి అభినందించారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా..డిసెంబర్ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు కేరళ రాష్ట్రం లొ జరగబోయే జాతీయ స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీలకు ఆంధ్ర ప్రదేశ్ జట్టకు విశాఖ క్రీడాకారులు పాల్గొనటం విశాఖ జిల్లాబాస్కెట్ బాల్ అసోసియేషన్ కు గర్వకారణం అని సునీల్ మహంతి అన్నారు,ఎంపిక అయిన క్రీడాకారులు చిత్తూరు లో కోచింగ్ కెంపు 24నవంబర్ నుంచి 6డిసెంబర్ 2022 తారీకు వరకు స్పెషల్ కోచింగ్ లో పాల్గొననున్నరు వీరిలో బాలికల విభాగంలో వై.హేమలత మరియు జీ. హేమ,బాలుర విభాగంలో పి.లీలకుమార్ మరియు కే.కార్తికేయగణపతి నాయుడు ఎంపిక అయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ బాలుర జట్టుకు మన విశాఖ పట్టణం క్రీడాకారుడును సారధి గా పి.కుమార్ వ్యవహరించడం మనకి గర్వకారమన్నారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ టి.ఎస్.ఆర్.ప్రసాద్, అధ్యక్షులు సునీల్ మహంతి,కార్యదర్శి శ్రీ జి.భూషనరావు ఓప్రకటనలో మీడియాకు తెలిపారు.జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న బాస్కెట్ బాల్ క్రీడాకారులకు విశాఖపట్టణం జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతనిధులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

