వాంబేకాలనీలో యూజర్ చార్జెస్ మరియు డ్రైడే ఫ్రైడే పై అవగాహన కార్యక్రమం.

వాంబేకాలనీలో యూజర్ చార్జెస్ మరియు డ్రైడే ఫ్రైడే పై అవగాహన కార్యక్రమం.

వాంబేకాలనీ :

భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 వాంబేకాలనీలో డ్వాక్రా ఆర్ పి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు యూజర్ చార్జెస్, మరియు ఫ్రైడే డ్రైడే పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జోన్ 2కమీషనర్ బొడ్డేపల్లి రాము పాల్గొని డ్వాక్రా మహిళలకు ఇంట్లో వాడుతున్న నీళ్ల ట్యాంక్, డ్రమ్స్ వారంలో ఒక్క రోజు ప్రతీ శుక్రవారం అన్నీ కాలీ చేసి శుభ్రపరచుకోవాలని ఆవిధంగా చెయ్యటం వల్ల దోమలను నివారించవచ్చని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ప్రజలు ఆరోగ్య ఉండవచ్చని సూచించారు.

చెత్త బండి మీ ఇంటివద్దకే వచ్చినప్పుడు ప్రతిఒక్కరు బండికి చెత్తను అంద చెయ్యాలని పరిసరాలలో చెత్తను వెయ్యరాదని తెలుపుతూ చెత్తపై వేసిన యూజర్ చార్జెస్ ప్రతీ ఒక్కరు కట్టి నగర అభవృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు జోనల్ కమీషనర్ సమక్షంలో స్వచ్చందంగా యూజర్ చార్జెస్ కట్టి నగర అభవృద్ధికి తోడ్పాటు ను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ శానిటరీ అధికారులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.