విజయవంతంగా ఉమ్మడి విశాఖ జిల్లా అండర్ 14 & 17 టైక్వాండో ఎస్ జి ఎఫ్ సెలక్షన్స్

విజయవంతంగా ఉమ్మడి విశాఖ జిల్లా అండర్ 14 & 17 టైక్వాండో ఎస్ జి ఎఫ్ సెలక్షన్స్.

మధురవాడ:

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్ జి ఎఫ్ టైక్వాండో జిల్లా టీం సెలక్షన్స్ మధురవాడ చంద్రపాలెం హై స్కూల్ సమీపంలోని వాంబే కాలనీ రోడ్డు ద్రోణం రాజు ఫంక్షన్ హాల్ లో విజయవంతంగా కొనసాగుతున్నాయి.

రెండవ రోజైన శుక్రవారం

 అండర్ 17 క్యాటగిరి విభాగంలో ఉమ్మడి విశాఖ జిల్లా కు సంబంధించి విశాఖ అనకాపల్లి తో పాటు ఎస్సార్ జిల్లాలకు చెందిన సుమారు 150 మంది వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు పోటీలో తలపడ్డారు.

జీవీఎంసీ జూన్ 2 జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఎస్ జి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలా వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ అమేచూర్ టైక్వాండో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఆనందరావు, చంద్రపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పిడి రాము పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలలో వైకాపా నాయకులు ,బంగారు ప్రకాష్ బిజెపి నాయకులు ప్రదీప్ కుమార్ బోయపాలెం హై స్కూల్ పిడి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

అక్షయపాత్ర మరియు విజయం స్కూల్ మధురవాడ లు

 క్రీడాకారులకు భోజన వసతి కల్పించారు. శరీర బరువు ఆధారంగా 11 కేటగిరిలలో బాల బాలికలకు వేరువేరుగా జరిగిన ఈ పోటీలలో విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచిన వారు జిల్లా టీం తరఫున ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నంద్యాలలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 


అండర్ 14 విజేతలు

..........

 అండర్ 14 ఇయర్స్ బాలుర 25 కేజీల విభాగంలో టీ చిన్నారావు (చంద్రంపాలెం హై స్కూల్) , 27 కేజీల విభాగంలో డి ధర్మరాజు( జడ్పీహెచ్)

, 29 కేజీల విభాగంలో కే వరుణ్ కుమార్( జడ్పీహెచ్ కసింకోట ),

32 కేజీల విభాగంలో

 పూజిత్( ఏ వి కే),

 35 కేజీల విభాగము ఎస్ రోహిత్ కుమార్ (జివిఎంసి), 38 కేజీల విభాగంలో బి దినేష్ (శ్రీ చైతన్య అనకాపల్లి) , 41 కేజీల విభాగంలో ఏ శ్రీరామ్ (జడ్పీహెచ్)

41 కేజీల పైబడిన విభాగంలో ఎన్ నిఖిల్( మధురవాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ) 


అండర్ 14 బాలికల విభాగంలో 18 కేజీల విభాగంలో ఎన్ యోగిత (కేజీబీవీ మునగపాక) 

22 కేజీల విభాగంలో పి తేజ సత్య శ్రీ( కేజీబీవీ అచ్చుతాపురం)

 24 కేజీల విభాగంలో కె ధరణి (కేజీబీవీ మునగపాక )

26 కేజీల విభాగంలో వి గీతిక (కేజీబీవీ అచ్యుతాపురం) 

29 కేజీల విభాగంలో వై జోష్ణ శ్రీ (పెదగంట్యాడ జడ్పీహెచ్ స్కూల్) 

32 కేజీల విభాగంలో కె ధనలక్ష్మి( చంద్రంపాలెం జడ్పీహెచ్ స్కూల్)

 35 కేజీల విభాగంలో ఎం పవిత్ర (జీవీఎంసీ గౌత హై స్కూల్) 38 కేజీల విభాగంలో జి యహతి నవ్య శ్రీ (శ్రీ ప్రకాష్ స్కూల్)

 38 కేజీల పైబడిన విభాగంలో పి సుస్మిత (కూర్మన్నపాలెం జడ్పీహెచ్ స్కూల్ )

విజేతగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు