25న ఉమ్మడి విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం వనసమారాధన.
మధురవాడ:
మధురవాడ: ఉమ్మడి విశాఖ జిల్లా యాదవ సంక్షేమసంఘం వారి ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం డిసెంబర్ 25న ఆదివారం,మధురవాడ (జాతర)శిల్పారామంలో నిర్వహిస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా యాదవ సామాజిక వర్గ ఐక్యతను చాటిచెబుతూ..మధురవాడ (జాతర)శిల్పారామం ఆవరణలో వనభోజన పిక్నిక్ ను నిర్వహించనున్నట్లు,ఈ వనభోజన కార్యక్రమంలో 8000నుండి10,000మంది యాదవ కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఓమ్మిసన్యాసిరావు, ఉపాధ్యక్షులు మొల్లిలక్ష్మణరావు,ఓమ్మి అప్పారావు,కార్యదర్శి మొల్లి అప్పారావు,యువత అధ్యక్షులు పల్లాదుర్గారావు.. శుక్రవారం జాతరలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలియజేసారు. సమావేశంలో అధ్యక్షులు ఓమ్మిసన్యాసిరావు మాట్లాడుతూ... విశాఖలో యాదవుల సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ పాటు పడుతోందని తెలిపారు.తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ కుటుంబాల ఐక్యతను తెలియజేస్తూ మానసిక, శారీరక ఆహ్లాదం కొసం ప్రతి యేడాది మాదిరిగా ఈ సంవత్సరం డిసెంబర్ 25 తేదీన ఆదివారం ఉదయం 9 నుంచి 5:30 వరకు వనభోజన పిక్నిక్ ను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పిక్నిక్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు,ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి,మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్, టిడిపి పాలిటి బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిధులుగా హాజరువుతున్నట్లు తెలిపారు. మ్యాట్రిమోనీ,ఉచిత మెడికల్ క్యాంప్ లు, ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమంనిర్వహించనున్నట్లు తెలిపారు.

