నూతనంగా ప్రారంభమైన లివింగ్ స్పేస్ ఫర్న్ చెర్ షో రూమ్

 నూతనంగా ప్రారంభమైన లివింగ్ స్పేస్ ఫర్న్ చెర్ షో రూమ్ 

మధురవాడ వి న్యూస్  నవంబర్:18:- 

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి  వెంకట కుమారి రెండవ జోన్ పరిధిలోని మీదిలాపూరి వుడా కాలనీ, తారకరామా నగర్ ఏరియా నందు ఆదివారం లివింగ్ స్పేస్ ఫర్నిచర్ షోరూమ్ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఒక గృహానికి సరిపడా ఫర్నిచర్ ఈ లివింగ్ లైఫ్ లో అనేక రకాలో దొరుకుతుందని అలాగే విశాఖపట్నంలో లివింగ్ లైన్స్ లో దొరికినంత రకరకాలు ఫర్నిచర్ ఇంకెక్కడ దొరకదని  అలాగే సామాన్యుడి నుండి గొప్పింటి వరకు అనుకూలమైన ధరల్లో ఇక్కడ ఫర్నిచర్ దొరుకుతుందని మేయర్ తెలిపారు...ఈ సందర్భంగా లివింగ్ స్పేస్ ఫర్నిచర్ షోరూమ్ను అధినేత యన్.


శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ ఆకృతులు కలిగిన ఫర్నిచర్ ముఖ్యంగా కుక హోమ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫర్నిచర్ ఈ షోరూం లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ షో రూమ్ లో సుమారుగా 60 రకాల కలర్లు సంబంధించి సోఫాలు అందుబాటులో ఉన్నాయి అలాగే అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలని ఫర్నిచర్ అధినేత యన్. శ్రీనివాసరావును నగర మేయర్ కోరారు. నగరంలో మరిన్ని లివింగ్ స్పేస్ ఫర్నిచర్ షోరూమ్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మేయర్ కోరారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు గోలగాని శ్రీనివాసరావు, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.