విశాఖ పార్లమెంట్ ఓబీసీ అధ్యక్షులు పోతిన పైడిరాజు ఆధ్వర్యంలో ఓబీసీ కమిటీ సమావేశం
భీమిలి వి న్యూస్ 2022 డిసెంబర్ 17
విశాఖ పార్లమెంట్ ఓబీసీ అధ్యక్షులు పోతిన పైడిరాజు ఆధ్వర్యంలో శనివారం భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మరియు తగరపువలస మండలంలోని ఓబీసీ కమిటీల విషయమై బిజెపి ఆనందపురం మండల అధ్యక్షులు మీసాల. రామునాయుడు మరియు తగరపువలస మండల కమిటీ విషయమై తగరపువలస ఓబీసీ ఆఫీసులో పంపాన శ్రీధర్ మరియు జి పార్వతి తో పలు విషయాలు చర్చించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమణ రాజు , ప్రధాన కార్యదర్శి సనపల రామకృష్ణ , ప్రధాన కార్యదర్శి కిలపర్తి సత్యనారాయణ ,కార్యదర్శి పంపాను శ్రీధర్, కార్యదర్శి జి పార్వతి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జామి శివాజీ రావు తదితరులు పాల్గొన్నారు...


