తర్లువాడ గ్రామంలో మెగా పశువైద్య శిబిరం..
భీమిలి వి న్యూస్ ప్రతినిధి 2022 డిసెంబర్ 21
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ .జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనువాసరావు ఆదేశాలు మేరకు డి ఎల్ డి ఏ చైర్మన్ గాడు వెంకటప్పడు అధ్యక్షతన మరియు డి ఎల్ డి ఏ ఇ ఓ ఆద్వర్యంలో తర్లువాడ గ్రామంలో .మెగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది...
ఈ కార్యక్రమం లో ఆనందపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు పాల్గుని ప్రారంభం చేసారు..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ వెంకటప్పడు మాటడుతూ ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం అన్నారు. అలాగే రైతులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాడి పశువుల పెంపకం ఇంకా పెంచాలని తద్వారా రైతులు అభివృద్ధి చెందాలని కోరారు..
ఈ కార్యక్రమం లో డి.డి ( విశాఖపట్నం) వై ఎస్ ఆర్ సీపీ నాయకులు మజ్జి వెంకటరావు , సర్పంచ్ బి ఆర్ బి నాయుడు , గాడు వెంకట నారాయణ , నీలాపు సూర్య నారాయణ ,అధికారులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు పాల్గున్నారు.

