ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి ఒక నెల జీతం విరాళం రూ.1,10,000/- అందజేసిన కలెక్టర్

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి ఒక నెల జీతం విరాళం రూ.1,10,000/- అందజేసిన  కలెక్టర్.

ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన పెంచాలి

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున 

విశాఖపట్నం, డిశంబరు 1: అసమానతలను అంతం చేయడానికి  అందరూ ఏకమవ్వాలని,  ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ  కార్యాలయంలో  ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులతో  కలసి అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ సోకిన వారిని  అందరితో సమానంగా చూడాలని, కొత్తగా ఏ ఒక్కరూ కూడా హెచ్ ఐ వి భారిన పడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికే ఎయిడ్స్ సోకిన వారిని ఎటువంటి వివక్షత చూపకుండా సామూహికంగా కలుపుకొని పోవాలని ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్చంద సేవా సంస్థలు కృషి చేయాలన్నారు.  అదే విదంగా రక్తపరీక్షలు చేసేటప్పుడు, రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకొని ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా చూడాలన్నారు.

ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి తన వంతు విరాళంగా ఒక నెల జీతాన్ని రూ 1,10,000/- చెక్కు రూపేణా డి.ఎల్.ఓ డా.పూర్నేంద్రబాబు  కు అందజేసారు.  

  ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డి ఎల్ ఓ కన్వీనర్ గా ఎయిడ్స్ వెల్పేర్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేసారు.  అనంతరం చిన్నారులతో కలిసి అల్పాహారం చేసారు. 

ఈ కార్యక్రమంలో  ప్రాంతీయ వైద్య సంచాలకులు డా.ఎం .ఉమాసుందరి, డి.ఎల్.ఓ డా.పూర్నేంద్రబాబు, జిల్లా ప్రోగామ్ అధికారులు, డా.ఎన్.జీవనరాణి, డా.ఎం .రమారెడ్డి, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్చంద సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.