గాయత్రి విద్యా పరిషత్ హాస్పటల్ నందు ఎయిడ్స్ పై అవగాహన
మధురవాడ పెన్ షట్ 2022 డిసెంబర్ 1;
భీమిలి జీవీఎంసీ జోన్ టు 5వ వార్డ్ మారికవలస గాయత్రీ విద్య పరిషత్ హాస్పిటల్ నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఒక ర్యాలీగా నిర్వహించారు.కళాశాల విద్యార్థులతో మరియు హాస్పటల్ సిబ్బందితో స్టాఫ్ నర్స్ తో ర్యాలీ గా మారికవలస హాస్పిటల్ నుంచి అన్నమరాజు కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ అంటే అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని దీనికి నివారణ చర్యలు కూడా వైద్యం వంటి మెడిసిన్స్ ఉన్నాయని , వ్యాధి సోకిన వారిని ఒక భూతంలో చూడవద్దని ఈ క్రమంలో డాక్టర్స్ తెలియజేస్తు హాస్పిటల్ నందు హెచ్ఐవి సెంటర్ నిర్వహించి ఉచితంగా వీరి కోసం ట్రీట్మెంట్ సదుపాయం కూడా కలిగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
డాక్టర్ డివివిఎస్ రమణమూర్తి, డీన్ డాక్టర్ సుబ్బారావు, సూపర్డెంట్ డాక్టర్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్ ఆఫీసర్ డాక్టర్ సీతామహాలక్ష్మి అలాగే సూపర్డెంట్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు...

