తుని వలస గ్రామంలో మాటా- మంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగలపూడి అనిత.
పద్మనాభం:
సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకేమి న్యాయం చేస్తారని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు విశాఖ జిల్లా పద్మనాభం మండలం తుని వలస గ్రామంలో తెదేపా భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో మాటా- మంతి కార్యక్రమానికి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని వైకాపా ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్లను ఎలా మోసం చేస్తున్నాడో చెప్పడానికి కుటుంబ సభ్యులను తల్లి చెల్లే నిదర్శనమన్నారు.
సంత బాబాయి హత్య కేసుల్లో నే రెండు నాలుకల ధోరణి వ్యాపరిస్తున్నారన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలని అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదంటూ కేసును సైతం ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమన్నారు.ఈ విషయంలో ఏపీ రాష్ట్ర డిజిపి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో షర్మిల బయటపెట్టిన నిజాలు ప్రజలకు ఎక్కడ చేరుతాయోనన్న భయంతోనే తిదప సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై కేసులు నమోదు చేశారన్నారు. జరుగుతున్న పరిణామాలకు బాధ్యతగా రాజీనామా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మటమంత కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురిమిన లీలావతి, బోడే అరుణకుమారి, తెదేపా మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
