మాజీ మంత్రి అయ్యన్నను మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ పంచకర్ల
మధురవాడ:
మధురవాడ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడుని శుక్రవారం ఆయన నివాసంలో జనసేన భీమిలి నియోజకవర్గఇంఛార్జ్ పంచకర్ల సందీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విడుదల అయ్యి బయటకు వచ్చిన అయ్యన్నను జనసేన నాయకులు కలిశారు. గత నెలలో జనసేన నాయకుల మీద జరిగిన అక్రమ అరెస్టుల సందర్భంలో అయ్యన్నపాత్రుడు విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చి జనసేన నాయకులకు సంఫీుభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఇరువురు నాయకులు
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ప్రశ్నించే గొంతును అణగదొక్కే ప్రయత్నం వైసీపీ చేస్తుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీ మెంబర్ కోన తాతారావు, చోడవరం జనసేన ఇంఛార్జ్ పీవీఎస్‌ఎన్.రాజు, విశాఖ నార్త్ ఇంఛార్జ్ ఉషాకిరణ్, తదితరులు పాల్గొన్నారు.

