శ్రీ భూనీలా సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సహస్ర దీపాలంకరణ.

శ్రీ భూనీలా సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సహస్ర దీపాలంకరణ.

మధురవాడ:


మధురవాడ మితిలాపురి ఉడా కాలనీ కొండపై వెంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక ఏకాదశి సందర్బంగా దేవాలయ ప్రాంగణంలోసహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు..ఈ యొక్క కార్తీక సహస్ర దీపాలంకరణ సేవ కనగాల శ్రీనివాస్,సుష్మ దంపతులచే నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామి దర్శనం అనంతరం దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామి కార్తీక ఏకాదశి పూజ అనుగ్రహన్ని పొందారు. సహస్ర దీపాలంకరణ సేవ గత పడ్నాలుగేళ్ల నుండి నిర్వహిస్తున్నామని గత ఏడాది వరకు ఆలయ చైర్మన్ సాయి లీలా నిర్వహించారు. ఈ ఏడాది కనగాల శ్రీనివాస్, సుష్మ దంపతులు నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.