5వ వార్డ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి :మొల్లిహేమలత

5వ వార్డ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: మొల్లిహేమలత


వార్డ్ పరిధిలో కొండవాలు ప్రాంతాలలో నీటి కష్టాలనుతీర్చండి.* 


 *వార్డ్ అభివృద్ధికి సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబుకు వినతిపత్రం అందజేత* .


 *మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి

5వ వార్డ్ పరిధిలో కొండవాలు ప్రాంతాలలో నీటి కష్టాలను వెంటనే తీర్చాలని,వార్డ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ మొల్లిహేమలత కోరారు.


ఈసమస్య పై పలు మార్లు కౌన్సిల్ సమావేశంలో లో మాట్లాడానని కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని మరియు వార్డ్ లో శంకుస్థాపనలు అవుతున్నాయి కానీ నెలలు గడుస్తున్న పనులు మాత్రం ప్రారంభించడం లేదని కావున ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి 5 వ వార్డ్ లో మౌలిక సదుపాయాలయిన త్రాగునీరు ,డ్రైనేజీ,రోడ్లు, వీధిలైట్లు,స్మశాన వాటికల అభివృద్ధి చేయాలని మరియు సాయిరాం కాలనీ,శారదనగర్, మంచినీటి స్టోరేజ్ ట్యాంకులు నిర్మాణం, జె.ఎన్ఎన్.యు.ఆర్.మ్, వైయస్సార్ కాలనీ,సాయిరాం కాలనీ,స్వతంత్రనగర్-ఎన్టీఆర్ హుదూద్ కాలనీలలో మంచినీరు,భూగర్భ డ్రైనేజీ (యూ జి డి )సమస్య ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ మొల్లిహేమలత కౌన్సిల్ సమావేశంలో వివరించి,స్థానిక ప్రజల కష్టాలను తీర్చేందుకు సహకరించాలని వినతిపత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు త్వరలోనే వార్డులో పర్యటించి పరిష్కార మార్గం చూపుతామని హామీఇచ్చారు.