ఆంధ్ర యూనివర్సిటీ వై వి యస్ మూర్తి ఆడిటోరియం లో ఆధార్ వర్క్ షాప్

ఆంధ్ర యూనివర్సిటీ వై వి యస్ మూర్తి ఆడిటోరియం లో ఆధార్ వర్క్ షాప్

ఆంధ్ర యూనివర్సిటీ:


శుక్రవారం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వై వి యస్ మూర్తి ఆడిటోరియం లో జరిగిన ఆధార్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా కలెక్టర్ అయిన మల్లికార్జున పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ప్రారంభించారు.గ్రామ వార్డ్ సచివాలయం ఈ యస్ డి,బ్యాంక్ పోస్టాఫీసు లో చేస్తున్న ఆధార సెంటర్ ఆపరేటర్స్ అందరూ ఈ వర్క్ షాప్లో పాల్గొన్నారు. ఆధార్ సేవలు ఎలా చేయాలి, ఎంత సర్వీస్ చార్జెస్ తీసుకోవాలని అలాగే సర్విస్ చేస్తున్నప్పుడు వచ్చే సర్వర్ ఇబ్బందుల ను ఎలా అధిగమించాలో యు ఐ డి ఎ ఐ & రాష్ట్ర జి యస్ డబ్ల్యూ యస్ టీమ్ ద్వారా తెలియపరిచారు. సిటిజన్స్ ప్రతి 10 ఏళ్లు ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ ఎందుకు చేసుకోవాలో వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జిల్లా డి ఎల్ డి ఓ స్పెషల్ అధికారి జి యస్ డబ్ల్యూ యస్ పూర్ణిమ, యు ఐ డి ఎ ఐ ఢిల్లీ టీమ్ వారు గిరిధర్, హితేష్, జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నాయుడు, ఎ డి సి భార్గవ్ మరియు ఏపీ టి ఆన్లైన్ టెక్నికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసు రావు, తదితరులు పాల్గొన్నారు.