విద్యార్థుల పై ఆగని నారాయణ కళాశాల యాజమాన్యం వేధింపులు.
మధురువాడ:
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న యాజమాన్యం.
విద్యార్థుల తల్లి తండ్రులతో దురుసుగా వ్యవహారిస్తున్న యాజమాన్యం.
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.
కళాశాల పై చర్యలేవి?
విశాఖపట్నం జిల్లా,మధురువాడ, దుర్గానగర్ లో ఉన్న నారాయణ ఐఐటి మరియు నీట్ అకాడమీలో గత నెల అక్టోబర్17వ తారీఖున విద్యార్థి సాయి అనే యువకుడు గణేష్ అనే లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక మరణించడంతో కాలేజీ విద్యార్థులందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు,
అలా నిరసన వ్యక్తం చేసిన 20 మంది విద్యార్థుల్ని కక్ష సాధింపుతో కాలేజీ యాజమాన్యం కాలేజీకి రానివ్వడం లేదని, పోనీ ఏదైనా కాలేజీలో జాయిన్ అవుదామంటే టీసీ ఇవ్వడంలేదని, అంతేకాకుండా మరే ఇతర కాలేజీలో జాయిన్ అవ్వకుండా అడ్డుకుంటున్నారని, ఇలా అర్ధాంతరంగా పిల్లలని కాలేజీకి రానివ్వకుండా ఆపి వేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థి చావుకు కారకుడైన గణేష్ అనే లెక్చరర్ మీద మాత్రం కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు . దీంతో కాలేజీ ప్రిన్సిపల్ స్పందించి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకి సోమవారం నాటికల్లా న్యాయం జరిగేలా చేస్తానని సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు..

.jpeg)