ప్రభుత్వ విప్ ధర్మ శ్రీ దత్తత గ్రామంలోని డోలు మోతలు తప్పడం లేదు.
చలిసింగం:
ఎన్నాళ్లు మా ఈ డోలుమోతలు.అంటున్న చలి సింగం గ్రామస్థులు.ప్రభుత్వ విప్ దత్తత గ్రామమైన చలి సింగం గ్రామంలో రెండు వారాలు తిరగకముందే డోలు మోతలతో అనారోగ్యంతో బాధపడుతున్న సత్తిబాబును తీసుకెళ్లారు .
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో 500 మంది జనాభా కలిగి ఉన్నారు ఈ గ్రామానికి3 కిలోమీటర్ల దూరం కొండ శిఖరం పై జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి రోడ్ సౌకర్యం లేకపోవడంతో. తరచూ అనారోగ్యం గురవుతే డోలుమూతలు తప్పడం లేదు. గత రెండు వారాల క్రితం కిముడు చంటిబాబు డోలి మోతలో తీసుకెళ్లి మార్గం మధ్యలో మరణించారు. నేడు అదే విధంగా
చీపురు సత్తిబాబు (48) కాలు వాపులతో ఇబ్బంది పడుతూ చలి సింగం గ్రామం నుండి సి కే పాడు గ్రామం వరకు3 కిలోమీటర్ డోలి తీసుకొచ్చి అక్కడనుండి ఆటోలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
స్వతంత్రం వచ్చి నేటికి 75 సంవత్సరాల అయినా అమృత ఉత్సవాలు పేరు మీద దేశవ్యాప్తమైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటుంటే కనీసం నడవడానికి తోవ లేనటువంటి పరిస్థితి నేడు చోడవరం నియోజకవర్గంలో చలి సింగం గ్రామంలో ఆదివాసులు నివాసం ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మశ్రీ స్వయాన చలి సింగం గ్రామం ఎన్నికల ప్రచారానికి వచ్చి మా గ్రామాన్ని కి దత్తత తీసుకుంటామని ప్రకటించి మూడున్నర సంవత్సరాల అవుతున్న మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేటటువంటి పాలకులు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెబుతూ ఉన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలనిజిల్లా కలెక్టర్ శని సింగం గ్రామాన్ని సందర్శించి రోడ్డు సౌకర్యం కల్పించాలి గిరిజన సంఘం మండల కార్యదర్శి సి హెచ్ శంకర్రావు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రోడ్డు సౌకర్యం కల్పించకపోతే ఈనెల 15వ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డోలీలతో ఆందోళన చేస్తామని తెలియజేయడం జరిగింది.

