కింగ్ జార్జ్ హాస్పిటల్ లో మంచినీటి కొరత తో ఇబ్బందులు పడుతున్న రోగులు, సిబ్బంది.

కింగ్ జార్జ్ హాస్పిటల్ లో మంచినీటి కొరత తో ఇబ్బందులు పడుతున్న రోగులు, సిబ్బంది.

విశాఖపట్నం నవంబర్ 24:

ఉత్తరాంధ్రలోనే మెరుగైన చికిత్స అందించే ప్రభుత్వ ఆసుపత్రిగా కింగ్ జార్జ్ హాస్పిటల్ కు పేరు ఉంది  ప్రస్తుత కాలంలో వైద్య సేవలు అంతంతమాత్రంగా రోగులకు అందుతున్న వేళ ఇప్పుడు కొత్త సమస్య ఎదురుపడింది గత వారం రోజులుగా రోగులు సిబ్బంది త్రాగడానికి వాడుకకు నీళ్లు లేక సొంత డబ్బుతో బయట నుండి నీళ్లు రప్పించుకునే పరిస్థితి ఏర్పడింది  ఈ నీటి సమస్య పై పలుమార్లు సిబ్బంది రోగులు ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేని వైనం ఇలాంటి ఆసుపత్రికి ఉత్తరాంధ్ర ప్రాంతం, ఒడిస్సా నుండి రోజు అనేకమైన ఆరోగ్య సమస్యలతో పేద ప్రజలు వస్తుంటారు వారికి ఈ నీటి సమస్యకుడా ఏదురురవ్వడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఉండే వార్డులలో పేరుకే కుళాయిలు  నీళ్ళు రాని పరిస్థితి, ఇటువంటి పరిస్థితి కేజీహెచ్ ఆసుపత్రి కి ఎప్పుడూ లేదని, ఇప్పుడు తీవ్ర నీటి కొరత ఏర్పడిందని సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైనా నాయకులు ఉన్నతాధికారులు స్పందించి  వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆస్పత్రికి నీటి సమస్య పరిష్కరించాలని రోగులు ప్రజలు సిబ్బంది కోరుకుంటున్నారు.