ప్రపంచకప్ పోటీల్లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
అడిలైడ్:
అడిలైడ్: ప్రపంచకప్ పోటీల్లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. ఆ జట్టుపై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. లిట్టన్ దాస్ విజృంభణతో ఓ దశలో భారత్ ఓడిపోతుందేమోనని ఆందోళన కలిగినప్పటికీ.. ఆపై బౌలర్లు పుంజుకోవడంతో రోహిత్ సేన గట్టెక్కింది. టాస్ ఓడిపోయి టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా విరాట్ కోహ్లీ 64*, కేఎల్ రాహుల్ 50, సూర్యకుమార్ 30 రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆపై బంగ్లా బ్యాటింగ్‌కు రాగా.. ఓపెనర్ లిట్టన్ దాస్ (60) చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. అయితే, రెండో ఇన్నింగ్స్ ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురవడంతో ఈ ఇన్నింగ్స్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఆఫ్ సెంచరీ సాధించి ఊపుమీదున్న దాస్‌ను కేఎల్ రాహుల్ రనౌట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. భారత బౌలర్లు పుంజుకొని వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ టీమ్‌ఇండియా వశమైంది.
