భీమిలి తీరంలో లైఫ్ గార్డుల ఏర్పాటు.
భీమిలి:
భీమిలి తీరంలో ఇటేవల కాలంలో ఈత కోసం దిగి యువకులు మరణించడంతో భీమిలి ప్రెస్ క్లబ్ మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి (ఫాబ్) సభ్యులు సంయుక్తంగా భీమునిపట్నం సముద్ర తీరంలో లైఫ్ గార్డ్ లను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రతీ శనివారం మరియు ఆదివారం ఒక అయిదు వారాల పాటు ఫాబ్ మరియు భీమిలి ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయంతో ఇద్దరు లైఫ్ గార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భీమిలి జోనల్ కమీషనర్ ఎస్.వెంకటరమణ మరియు భీమిలి స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి సామాజిక దృక్పథం కలిగిన కార్యక్రమాలను చేపట్టిన భీమిలీ ప్రెస్ క్లబ్ మరియు ఫ్యాబ్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మధ్య కాలంలో భీమిలి సముద్రంలో కొంతమంది యువకులు మరణించడం దురదృష్టకరమని అలాంటివి జరగకుండా ఈ లైఫ్ గార్డులు కొంత మేర రక్షించే అవకాశం వుందని అన్నారు. ఇదివరలో ఇక్కడ లైఫ్ గార్డులు గా పనిచేసిన తెడ్డు రాందాస్, అప్పన్న లు ఈ పనికి ముందుకు రావడం చాలా సంతోషకరమని అన్నారు. నిరంతరంగా ఈ కార్యక్రమం జరిగేలా తమ తరపున స్థానిక శాససభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు పై అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని వారు చెప్పారు. ఈ సందర్బంగా భీమిలి ప్రెస్ క్లబ్ కార్యదర్శి అడిదం కిషోర్ మరియు ఫ్యాబ్ ప్రతినిధి సూర్య శ్రీనివాస్ ముసునూరి మాట్లాడుతూ పిక్నిక్ సీజన్ కావడంతో అనేక మంది సందర్శకులు భీమిలి ప్రాంతానికి వచ్చి సముద్ర తీరంలో సేద తీరుతారని, ఆ సమయంలో కొంతమంది యువతీ యువకులు అత్యుత్సాహంతో సముద్రంలో స్నానాల కోసం దిగి ప్రమాదానికి లోనవుతున్నారని అన్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో బాగా లోతుగా ఉండడంతో సముద్ర స్నానానికి దిగిన సందర్శకులు ప్రమాదానికి గురై మృత్యువాత పడుతున్నారని, ఇటీవల ముగ్గురు యువకులు ఈ రకంగా ప్రమాదానికి లోనయ్యారని, వారి మృతదేహాలు కూడా ఇంతవరకు లభ్యం కాలేదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భీమిలి ప్రెస్ క్లబ్ మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి (ఫాబ్) ప్రతినిధులు ముందుకు వచ్చి వారి ఆర్థిక సహకారంతో ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకుగానూ లైఫ్ గార్డులను వారాంతాల్లో శని, ఆదివారాలలో ఉండే విధంగా డిసెంబర్ నెలాఖరు వరకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాబ్ ప్రతినిధులు కాళ్ళ సన్నీ, సూర్యశ్రీనివాస్ ముసునూరి, సాయి గుగ్గిళ్ల, అశోక్ కట్టమూరి, సత్యనారాయణ విజ్జపు, గోపి మారోజు, నరేంద్ర కుమార్ కందివలస, మరియు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు రమణప్రసాద్ , అడిదం కిషోర్ , వర్మ, గిడుతూరి శ్రీనివాస్, అంజనీ కుమార్, అప్పలరాజు, సాక్ష్యం శ్రీనివాస్, రాజేటి బసవ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

.jpeg)