52 ఏళ్ల క్రితంనాటి రికార్డును తుడిచిపెట్టేయనున్న ఒరాయన్.
వాషింగ్టన్:
వాషింగ్టన్: జాబిల్లిపైకి మళ్లీ మానవులను పంపే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ఇటీవల ప్రయోగించిన ఒరాయన్ క్యాప్సూల్ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. మానవ ప్రయాణానికి వీలుగా తయారై.. భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది చరిత్ర సృష్టించనుంది. శనివారంతో ఈ క్యాప్సూల్ మొత్తం 4,32,192 కిలోమీటర్లు ప్రయాణించినట్లవుతుంది. 52 ఏళ్ల క్రితం అపోలో-13 వ్యోమనౌక భూమి నుంచి 4,00,171 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. మానవసహిత ప్రయాణానికి అనుగుణంగా తయారై అత్యధిక దూరం ప్రయాణించిన ఘనత ఇప్పటివరకు దాని పేరు మీదే ఉండేది. తాజాగా ఆ రికార్డును ఒరాయన్ తుడిచిపెట్టేయనుంది.

