గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్
అమరావతి :
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 11వేల మంది గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2లోకి మార్చనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల డి ఏ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు, ఏప్రిల్లో సచివాలయ సిబ్బంది బదిలీలకు సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
