విజయ్ బాబు ఆధ్వర్యంలో 46వ వార్డు లో "ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి" కార్యక్రమం
విశాఖ ఉత్తరo:
రాష్ట్రంలో ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ పాలనను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో 46వ వార్డు లో "ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, సెక్రటరీ గండి రవి కుమార్, కార్పొరేట్ అభ్యర్థి పామోటి బాబ్జీ, ఐటిడిపి ఛాంపియన్ జోష్, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, మాజీ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు రాజమండ్రి నారాయణ, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు సనపల వరప్రసాద్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసుపల్లి రాజు, జిల్లా పార్లమెంటరీ ఐటిడిపి ప్రెసిడెంట్ నరేష్, జిల్లా తెలుగు యువత కార్యదర్శి ధనాజి గౌడ్, మహేష్, నియోజకవర్గ తెలుగు యువత ప్రెసిడెంట్ సునీల్, 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ గొంప ధర్మారావు, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, రమణ, 47వ వార్డు సెక్రటరీ రాజు, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

