త్రాగునీటి చేతిపంపు బోర్లు ప్రారంభించిన 5వ వార్డు కార్పొరేటర్: మొల్లి హేమలత
మధురవాడ:
మధురవాడ: మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను 5వ వార్డు కార్పోరేటర్ మొల్లి హేమలత ఒక్కొక్కటిగా వార్డు ప్రజలకు చేరువచేస్తున్నారు.ముఖ్యంగా వార్డు ప్రజలకు అవసరమైన రోడ్లు,పార్కుల ఏర్పాటు,మంచినీటి సదుపాయం,డ్రైనేజీవ్యవస్థ, కల్వర్ట్ ఏర్పాటు..ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలలో నీటి సదుపాయం పై దృష్టిసారించారు.వీటిలో భాగంగా వార్డు పరిధిలో వైయస్సార్ కాలనీ, స్వతంత్రనగర్, సాయిరాంకాలనీ... ప్రజల అవసరార్థం త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 9 చేతి పంపు బోర్లు ప్రారంభించారు.ఈసందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ వార్డ్ లో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే తన ధ్యేయమని తెలిపారు.అలాగే నన్ను నమ్మి గెలిపించిన వార్డ్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వార్డును మరింతగ అభివృద్ధి చేపడతానని,రూ 1.50 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు 5వ వార్డులో చేపట్టబోతున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,స్థానిక కాలనీల పెద్దలు,మహిళలు పాల్గొన్నారు.

.jpeg)
