చంద్రంపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1994-1995 బ్యాచ్ అపురూప కలయిక.

చంద్రంపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1994-1995 బ్యాచ్ అపురూప కలయిక.

చంద్రంపాలెం:

చంద్రంపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో  ఆప్యాయతతో అందరూ ఒక యువ సమూహంల  కలుసుకున్నారు.    వీళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, రోజు వారి కూలి కూడా చేసిన వారున్నారు.. అయితే వీరందరి మధ్య  అటువంటి తారతమ్యాలు లేకుండా కలిసి మెలిసి వుంటారు.. వీల్లలో ఒకరికి ఇబ్బంది కలిగిన అందరు కలిసి సహాయం చేసుకుంటారు.  అటువంటి వీళ్ళందరూ  ఆనందపురం పరిసర ప్రాంతములో వున్న గుడిలోవ లో  ఓ ఆధ్యాత్మిక ప్రాంతం లో వేదిక ఏర్పాటు చేసుకొని అందరూ కలవడం జరిగింది.  వీళ్ళందరికీ నాలుగు దశాబ్దాలు పూర్తయి వుండటం గమనార్హం..... వీరంతా విద్యాభ్యాసం పూర్తయి 27 సంవత్సరములు కావచ్చిన సరే ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడ ఇలా అందరు కలుసుకుని వారి బాల్య స్మృతులను నేమరివేసుకున్నారు... చిన్ననాటి స్నేహాలు గురించి గొప్పగా ఒకరికొకరు చెప్పుకుంటూ, డాన్సులు చేస్తూ పాటలు పాడుకుంటూ వాళ్ళ వయసులనే మర్చిపోయారు..  ఇటువంటి సంతోసకరమైన రోజును ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అనుకోవడమే కాకుండా ఇలా కలిసినప్పుడల్ల పేదలకు, విద్యర్హులకు, అనాధులకు ఇదివరకు చేసినట్టు ఇకపై కూడా సేవా కార్యక్రమం చేపట్టాలని ఆశిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో కొంతమంది ఉద్యోగ, వ్యాపార కారణాల వలన హాజరు కాలేక పోయిన సరే చాలమంది హాజరు అయ్యారు.  ఇంత మంచి కార్యక్రమముకు ముందుండి ముందడుగు వేసిన రాము, ఆదినారాయణ, శ్రీను, మంగరాజు, బంకురాజు, చిన్నారావు, గణేష్,  సూరిబాబు మరియు మరికొందరు విద్యార్థులు పాల్గొన్నారు.  అందరు కలిసివుంటే కలదు సుఖం అన్న విసయాని వీరిని ఆ సమయం లో చూస్తేనే అర్ధం అవుతుంది.  అ సమయంలో శంకర్ రెడ్డి ఓ కవిత కూడా మిత్రుల సమక్షంలో చెప్పారు ఇలా...

“ మన అందరకి””

కల చెదిరిపోయినా 

కొలను ఇంకిపోయినా

కడలి అలలు కడలి పోయినా 

కలం కరిగిపోయినా 

మేఘం కమ్ముకోకపోయినా 

ఆకరి వరకు కలిసి ఉందాం 

మన అందరం 

మనమంతా ఈ స్నేహ కుసుమలను 

విజసింప చేద్దాము.

చంద్రం పాలెం 1995 బ్యాచ్ అంటే మరో 99 బాచ్ లకు ఆదర్శం కావాలి అంటూ ఈ యువ బ్యాచ్ గొప్పగా చెప్పుకుంటు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.