రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి : తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్
రాష్ట్రపతి కార్యాలయంలో లేఖ అందజేత
రాజధాని పేరుతో విశాఖలో భూ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వినతి
అమరావతి రైతులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన
ప్రధాని, హోం శాఖ మంత్రుల కార్యాలయాలను లేఖ అందజేత
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయంలో గురువారం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు విశాఖలో పరిపాలన రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయని, అక్రమాలకు కారకులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.
వాస్తవానికి రాష్ట్రంలో ప్రజలెవరు మూడు రాజధానులను కోరుకోవడం లేదని, రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతినే ఆకాంక్షిస్తున్నారు అన్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర చేస్తున్న రైతులకు రక్షణ కల్పించాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా అధికార వైసీపీ విధానాలను ప్రశ్నిస్తున్న తనకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నుంచి ప్రాణహాని ఉందన్నారు. ఈ పరిస్థితులలో తనకు అవసరమైన రక్షణ కల్పించాలని వేడుకున్నారు.అదేవిధంగా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ శాఖ మంత్రి కార్యాలయాలలో కూడా వినతిపత్రాన్ని అందజేశారు.

