బ్యాంక్ వేలంలో కొన్న భూమి కబ్జా

 బ్యాంక్ వేలంలో కొన్న భూమి కబ్జా ..

భీమిలి వి న్యూస్ ప్రతినిధి :  కాపులుప్పాడ రెవెన్యూ గ్రామ పరిధి మంగమారిపేట లో సర్వే నంబర్ 300/2, 300/3 లో  65 సెంట్ల ప్రైవేట్ భూమి కబ్జాకు గురయ్యింది.  ఈ భూమి యజమాని బ్యాంక్ రుణం తీసుకుని చెల్లించక పోవడం స్థలాన్ని నిబంధనల మేరకు వేలం వేశారు. హైదరాబాద్ కి చెందిన మూర్తి అనే వ్యక్తి దీనిని  వేలం లో దక్కించుకున్నారు.  అయితే ఈ లోగా కొందరు వ్యక్తులు సుమారు కోటి రూపాయలు విలువైన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు స్కెచ్ వేసి ఫెన్సింగ్ పోల్స్ అందులో పాతి పెడుతున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు  భీమిలి పోలీసు లు, రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశారు . వేలంలో కొన్న స్థలాన్ని కబ్జా చేస్తున్న  వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు .  

బ్యాంక్ వేలం లో తాము కొనుగోలు చేసిన స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు.  దీని వెనుక  స్థానిక రాజకీయ నేత,  వ్యాపారవేత్త హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.  గతంలోనూ ఈ స్థలంలో అక్రమంగా రోడ్ వేసేందుకు ప్రయత్నం చేయగా అప్పట్లో అధికారులకు పిర్యాదు చెయ్యడం తో పనులు నిలిచిపోయాయి. కాగా  బాధితులు తమకి ఇచ్చిన  పిర్యాదు మేరకు  పనులు ఆపాలని పోల్స్ పాతుతున్న వ్యక్తులకు రెవెన్యూ అధికారులు చెప్పారు.  దీనిపై సర్వే జరిగే వరకూ దాని జోలికి వెళ్లారాదని హెచ్చరించారు.  ఎవరన్నా దీన్ని ఉల్లంఘించి పనులు చేస్తే వారి పై క్రిమినల్ కేసులు పెడతామన్నారు.