నగరాల సామాజిక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లండి: పిళ్ళా సుజాత సత్యనారాయణ
తాడేపల్లి : వి న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 27
వై ఎస్ ఆర్ సీ పీ బిసి సమావేశంలో పాల్గొని నగరాల సామాజిక వర్గం ప్రజల సమస్యల పరిష్కరించాలని కోరిన -పిళ్ళా సుజాత సత్యనారాయణ .
తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మంటపంలో రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ బీసీ ఆత్మీయ సమావేశంలో పాల్గొని నగరాల సామాజిక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విజయసాయి రెడ్డి కి మరియు బీసీ నాయకులకు వివరిస్తూ వినతిపత్రం ఇవ్వటం జరిగింది..


