నిజాలు మాట్లాడితే అరెస్టుల ; టిడిపి నేతలు
భీమిలి ; వి న్యూస్ ప్రతినిధి: బ్రేకింగ్ న్యూస్
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చయ్య నాయుడు మరియు టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో... భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త కోరాడ రాజబాబు సూచన మెరకు శుక్రవారం ఉదయం 10:00 గంటలకు రుషికొండ తవ్వకాలపై నిరసన కి పిలుపునిచ్చారు ...అందుకని ఇ చేతకాని వైస్సార్ ప్రభుత్వం టీడీపీ నేతల పై ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.దీనిలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో పాలు వార్డు లకు సంబంధించిన ముఖ్య నేతలు అయినా రాష్ట్ర బిసి సెల్ల ఉపాధ్యక్షుడు గొల్లంగి ఆనంద్ బాబు మరియు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,ను విశాఖ పార్లమెంటరీ జిల్లా కమిటీ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ ను విశాఖ జిల్లా అధికార ప్రతినిధి మరియు 6వ వార్డ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ను పీఎం పాలెం పోలీసులు ముందస్తు గా 41 నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేశారు.
కొంతమందిని ఇంటి వద్దే గృహ నిర్భంధం చేశారు. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం లో వైయస్సార్ గవర్నమెంట్ కి ఎదురుగా నిలదీసి నిల్చుంటున్న గొల్లంగి ఆనంద్ బాబుని మరియు నాగోతి సూర్యప్రకాష్ ని పోలీస్ స్టేషన్కు కు తీసుకువచ్చి నిర్బంధం చేశారు. దీనిపై స్పందించిన భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త రాజబాబు గొల్లంగి ఆనంద్ బాబు కి చరవని ద్వారా మాట్లాడుతూ నిరసన కార్యక్రమం లో పాల్గొనకుండ ఇటువంటి అరెస్టులు చేయటం దారుణమని ఆయన ఖండించారు...

