ఫ్లాష్ ఋషికొండను తాకిన తెలుగుదేశం పార్టీ.

ఫ్లాష్ ఋషికొండను తాకిన తెలుగుదేశం పార్టీ

ఋషికొండ:

ఋషికొండ వద్ద టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు.


ఋషికొండలో వైసీపీ చేస్తున్న అధికార దందా నిజమేనని రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది.

వైసీపీకి  ఉత్తరాంధ్ర అభివృద్ధిపై  ఉన్నది చిత్తశుద్ధి కాదు వనరులను దోచుకోవాలనే దుర్బుద్ధి తప్ప అని ప్రజలకు అర్థమైంది.

ఏపీలో వైకాపా పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం.

వైసిపి ముఖ్య నాయకులు మధ్య వాటాలు కుదరకపోవడం వల్లనే వారంతట వారే వారి కుంభకోణాలను బయట పెట్టుకున్నారు.

విశాఖ వేదికగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అధికారికంగా దోచుకోవాలనుకుంటున్నారు.

వైసిపి అరాచక విధానాలపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్నారు.

మీరు ఎంతగా అణిచివేయాలని చూస్తే అదేవిధంగా మా పోరాటం ఉంటుంది.

ఉత్తరాంధ్రలో వైసీపీ చేస్తున్నది అభివృద్ధి కాదు ప్రకృతి విధ్వంసం మరియు అక్రమ భూదందాలు.

వైసీపీ అక్రమాలకు పోలీసులు వంత పాడుతూ ఉండడం సిగ్గుచేటు.