టిడ్కో గృహ సముదాయాలలో పచ్చదనానికి మరియు పర్యావరణ పరిరక్షణ కు 1000 మొక్కలు అందించిన డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.నీలిమ.
కొమ్మాది:
టిడ్కో గృహ సముదాయాలలో పచ్చదనానికి మరియు పర్యావరణ పరిరక్షణ కు పంజాబ్ నేషనల్ బ్యాంక్, విశాఖపట్నం సర్కిల్ వారి తరుపున 1000 మొక్కలు అందించిన డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.నీలిమ
విశాఖపట్నం :ఏ.పి. టిడ్కో ఛైర్మన్.జమ్మాన ప్రసన్న కుమార్ అధికారిక పర్యటనలో భాగముగా జీవీఎంసీ జోన్ 2 కొమ్మాది టిడ్కో గృహ లబ్ధిదారులకు పంజాబ్ నేషన్ బ్యాంక్, విశాఖపట్నం సర్కిల్ ఆఫీస్ తరుపున డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ శశిధర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో వారికీ టిడ్కో నిర్మిస్తున్న గృహాలను అందులో కల్పిస్తున్న సదుపాయాలను చూపిస్తూ వాటిని వివరించడం జరిగింది విశాఖ లో చాల మంది లబ్ధిదారులు కు గృహాలను అందించే విషయంలో శీఘ్రముగా ఋణ సదుపాయం కల్పించాలని కోరడమైనది.
అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంక్, విశాఖపట్నం సర్కిల్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగముగా ఏపి.టిడ్కో గృహ సముదాయాలలో మొక్కలు నాటేందుకు 1000 మొక్కలు ఇచ్చి సహకరించినందుకు బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్.నీలిమకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి పుష్ప గుచ్ఛంతో ఘనముగా సత్కరించడం జరిగింది.
అనంతరం బ్యాంక్ అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొనడం జరిగింది. తదుపరి టిడ్కో హౌసింగ్ యొక్క నిర్మాణ పనుల యొక్క ప్రగతిని గూర్చి అధికారులను మరియు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిబ్బందిని అడిగి తెలుసుకొవడం జరిగింది.
తదుపరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ డి.జి.యం మరియు సీనియర్ మేనేజర్ నిర్మాణ పనులు మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంతటి చక్కనైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నటువంటి . ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని అభినందించడం జరిగింది మరియు బ్యాంకు లోన్స్ ఇప్పటికే తాము విశాఖ లో 5 బ్రాంచులు నుండి అందిస్తున్న మని మిగతా వాటిని కూడా అందించే విషయం లో పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.
అనంతరం పలు కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ (హౌసింగ్ మరియు ఇన్ఫ్రా) వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు డిసెంబర్ 2022 నాటికి పూర్తి సదుపాయాలతో ఇళ్లను నిర్మించి లబ్దిదారులందరకు ఇళ్ళు అందించే విధముగా కార్యాచరణను రూపొందించాలని తెలియజేయడం జరిగింది.
పై ఈకార్యక్రమంలో టిడ్కో సూపరింటెండింగ్ ఇంజనీర్.నరసింహమూర్తి, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ డి.సుధాకర్,సి.ఎల్.టి.సిలు సంచాన వెంకటరమణ, పి.దేముడు బాబు డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్పెషలిస్ట్ , మరియు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.

