తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులను కలసిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు పరీశీలకులు..
విశాఖ తూర్పు: వి న్యూస్ ప్రతినిధి
టీడీపీ విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం పై ,ఇంచార్జులుగా, పరీశీలకులుగ నియమించిన జిల్లా కమిటీ సభ్యులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ని టీడీపీ కార్యాలయంలో కలవడం జరిగింది. అనంతరం, శాసనసభ్యులు సమక్షంలో వార్టులకు సంబంధించిన అధ్యక్షులతో మాట్లాడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ , రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చోడే పట్టాభి , ఒమ్మి సన్యాసి రావు తూర్పు నియోజకవర్గ పరిధిలోని వార్టు నెంబర్ 9నుంచి13 ఇంచార్జు బోయి వెంకట రమణ( శ్రీను),మరియు వార్టు నెంబర్ 15 నుండి 20 ఇంచార్జు విల్లూరి చక్రవర్తి ,12 వ వార్టు పరిశీలకులు కోట నరేష్ ,13వ వార్టు పరిశీలకులు సరగడ అప్పారావు ,19వ వార్టు పరిశీలకులు జోగా ముత్యాలు, జిల్లాపార్టీ వైస్. ప్రెసిడెంట్ శ్రీ.పోతనరెడ్డి తదితరులు పాల్గొన్నారు .

