98వ వార్డులో మౌళిక వసతులు కల్పిస్తాం-- జివిఎంసి కమిషనర్ పి. రాజాబాబు

98వ వార్డులో మౌళిక వసతులు కల్పిస్తాం-- జివిఎంసి కమిషనర్ పి. రాజాబాబు.

విశాఖపట్నం, అక్టోబర్-26:-

జివిఎంసి పరిధిలో ఉన్న ప్రతి వార్డులో మౌళిక వసతులు కల్పిస్తామని జివిఎంసి పి. రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం, ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-8, 98వ వార్డు పరిధిలోని అడవివరం ఎస్.సి.కోలనీ, విజనిగిరి కోలనీ, మైత్రినగర్ తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేట పిసిని వరాహ నరసింహంతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల సమస్యలు కార్పొరేటర్ తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిలో ముఖ్యంగా బిఆర్టిఎస్ రోడ్డు పనులు ఆగినందున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారితో, జిల్లా రెవెన్యూ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని, కొండ నుండి వర్షపు వరద నీరు వలన దిగువన ఉన్న కాలువలలో పూడికలు ఏర్పడుతున్నాయని, వాటిని తొలగిస్తామని, ఎస్.సి. కోలనీలో వరద నీరు గెడ్డలో కలిసే విధంగా అనుసంధానం చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు అంచలంచెలుగా చేస్తామన్నారు. పంట కాలువలలోని “తోములు” శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చినప్పుడు దేవస్థానానికి చెందిన శ్రీదేవి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకు నీరు బయటకు వచ్చి దుర్వాసన వ్యాపిస్తుందని, దానిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. మైత్రి నగర్లో పార్కు ఎంట్రన్స్ ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్, పార్కు కి రక్షణ గోడ, రోడ్డు, విద్యుత్ మొదలైన మౌళిక వసతులు కల్పనకు అంచనాలు సిద్ధం చేస్తామని కార్పొరేటర్ కు తెలిపారు. అంతే కాకుండా వార్డులో శిధిలమైన రోడ్లు, కాలువలను పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీరు సంతోషి, ఎసిపి ఐ.వి. రమణ మూర్తి, ఎఎంఓహెచ్ సిహెచ్. సత్యనారాయణ, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.