ఉత్తర నియోజకవర్గ లో ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం

 ఉత్తర నియోజకవర్గ లో  ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం 

విశాఖ ఉత్తరం:వి న్యూస్ ప్రతినిధి

మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు  విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో మరియు వార్డు పరిశీలకులతో ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిర్ణిత సమయం లో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అందుకు తగిన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. 

వార్డు పరిశీలకులు వార్డు నాయకులు తో కలిసి ఓటర్ల నమోదు కార్యక్రమం అధికంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు  ఎమ్మెల్సీ అభ్యర్థి  గాడు చిన్ని కుమారి గారునియోజకవర్గ ఇన్చార్జి  చిక్కాల విజయ్ బాబు , మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు మరియు ఎమ్మెల్సీ ఎన్నికల వార్డు పరిశీలకులు వార్డు ప్రెసిడెంట్ లు సెక్రటరీ లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.