ముస్లిం మత అభివృద్ధే లక్ష్యం- విశాఖ ముస్లిం జేఏసీ

 ముస్లిం మత అభివృద్ధే లక్ష్యం- విశాఖ ముస్లిం జేఏసీ

మధురవాడ ; వి న్యూస్ ప్రతినిధి

వెనుకబడిన ప్రాంతాల్లో ముస్లింల కొరకు అభివృద్ధి కొరకు విశాఖ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశామని మధురవాడ కు చెందిన ముస్లిం పెద్దలు అన్నారు. ఆదివారం మహా  విశాఖ జోన్ 2 పరిధి 6వార్డు పీఎం పాలెం మసీదు  లో జరిగిన జమాత్ కార్యక్రమంలో పీఎం పాలెం, సాగర్ నగర్, బక్కన్నపాలెం, సుజాతనగర్, మారికవలస  తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం పెద్దల సమక్షంలో విశాఖ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ఇందులో అధ్యక్షునిగా ఏ ఆర్ షరీఫ్, కార్యదర్శిగా ఎస్కె షరీఫ్, కోశాధికారిగా మొహమ్మద్ జవహర్ హుస్సేన్ లతో మరి కొంతమందిని ఎన్నుకున్నట్లు తెలిపారు. 

ఈ మేరకు వారు మాట్లాడుతూ ముస్లిం కమిటీ శ్రేయస్సు కొరకు పాటుపడతామని, అలాగే ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలను తదితర ప్రయోజనాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.  క్రింది వారిని కమిటీ సభ్యులు గా ఎన్నుకోబడినారు. అధ్యక్షులు షరీఫ్ ,,  ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ షన్- వైస్ ప్రెసిడెంటు మొహినుద్దిని,,వైస్ ప్రెసిడెంటు హుస్సేన్,,ఎస్.కె షరీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి,, జాయింట్ సెక్రెటరీ ఎస్. కె. సలీమ్ - జాయింట్ సెక్రెటరీ చందే బాషా - ,, ఎమ్ డి. జవాహర్ హుస్సేన్- కోశాధికారి. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.