సింహాచలం దేవస్థానం అడవివరం ప్రధానరహదారిపై మరణించిన గోవు పట్టించుకోని సిబ్బంది

సింహాచలం దేవస్థానం అడవివరం ప్రధానరహదారిపై మరణించిన గోవు పట్టించుకోని సిబ్బంది.

సింహాచలం:

సింహాచలం దేవస్థానం అడవివరం ప్రధానరహదారిపై మరణించిన గోవును గోమాతగా హిందువులు పూజిస్తూ ఉంటారు అటువంటి గోమాత సింహాచలం అడవివరం ఘాట్ రోడ్ టోల్ ప్లాజా వద్ద మరణించి ఉందని అటుగా వెళ్తున్న వారు, స్థానికులు సింహాచలం దేవస్థానం పి ఆర్ ఓ కి, తెలియపరిస్తే మా పరిధిలోకి రాదని గోశాల పరిధిలోకి వస్తుందని తెలిపారని ఘాట్ రోడ్ టోల్ ప్లాజా వద్ద మరణించి ఉందని ఒక పత్రిక రిపోర్టర్ సింహాచలం దేవస్థానం పి ఆర్ ఓ కి, తెలియపరిస్తే మా పరిధిలోకి రాదని గోశాల పరిధిలోకి వస్తుందని తెలిపారని గోశాల సిబ్బందికి తెలియపరిస్తే మా పరిధిలోకి రాదు జీవీఎంసీ వారితో మాట్లాడుకోండి అంటున్నారని 98వార్డు జీవీఎంసీ సానిటరీ ఇన్స్పెక్టర్ కి సమాచారం ఇవ్వాలని ప్రయత్నించగా ఆయన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దేవస్థానం పరిసర ప్రాంతంలో గోమాతగా పూజిస్తున్న గోవు మరణిస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం పై స్థానిక హిందు గోమాత భక్తులు, ఆర్ ఎస్ ఎస్ సంఘ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. జీవీఎంసీ సానిటరీ ఇన్స్పెక్టర్ స్పందించకపోవటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జీవీఎంసీ సిబ్బంది స్పందించి మరణించిన గోవుని అక్కడి నుండి తొలగించాలని కోరుతున్నారు.