విశాఖ లోకల్ న్యూస్ వార్తకు స్పందించిన సింహాచలం దేవస్థానం సూపరింటెండెంట్ త్రిమూర్తులు.
సింహాచలం:
సింహాచలం దేవస్థానం అడవివరం ప్రధానరహదారిపై మరణించిన గోవును గోమాతగా హిందువులు పూజిస్తూ ఉంటారు అటువంటి గోమాత సింహాచలం అడవివరం ఘాట్ రోడ్ టోల్ ప్లాజా వద్ద మరణించి ఉందని అటుగా వెళ్తున్న వారు, స్థానికులు సింహాచలం దేవస్థానం సూపరింటెండెంట్ కి సమాచారం ఇవ్వటం తో త్రిమూర్తులు స్పందించి మరణించిన గోమాతను అక్కడినుండి తొలగించారు. జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది ఆదివారం కావటంతో అందుబాటులో లేకపోవటం వల్ల స్పందించలేకపోయానని వివరణ ఇచ్చారు. స్పందించిన సూపరింటెండెంట్ త్రిమూర్తులిని స్థానిక గోమాత భక్తులు అభినందించారు.
