ప్రజలను బెదిరించి సభకు తీసుకు వెళ్లడం చాలా దురదృష్టకరమైన విషయం

 ప్రజలను బెదిరించి సభకు తీసుకు వెళ్లడం  చాలా దురదృష్టకరమైన విషయం.సిపిఐ

మధురవాడ వి న్యూస్ 2022 అక్టోబర్ 15 :

 విశాఖ లో విశాఖ గర్జన పేరుతో జరుగుతున్న విశాఖ గర్జనకు ఆర్ పి లు మరియు వైసిపి మానస పుత్రుల ద్వారా  ప్రజలను బెదిరించి సభకు తీసుకు వెళ్లడం  చాలా దురదృష్టకరమైన విషయం అని మధురవాడ సిపిఐ పార్టీ తరఫున ఎం ఏ బేగం అన్నారు. ఇది విశాఖగర్జన కాదని బెదిరింపుల గర్జన  అని మాకు అర్థం అవుతుంది. మీరు ఏదైనా పురపాలిక రాజధాని పెట్టాలనుకుంటే కేంద్రంతో పోరాడితీసికురావాలి కానీ ప్రజలను బెదిరిస్తే రాదని  సీపీఐ పార్టీ తరుపున కోరారు.  ఏది ఏమైనా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కి  సీపీఐ పార్టీ తరుపున మేము తెలియజేసేది ఏమంటే మధురవాడ ఏరియా లో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనిని మీరు పరీక్షించాలని మధురవాడ బ్రిడ్జి కింద వాటర్ సమస్యలు కూడా మీరు పరిశీలించాలని ,హై స్కూల్ ఆవరణలో ఉన్న సమస్య కూడా  పరిశీలించాలని, నగరంపాలెం రోడ్లు సమస్యలను  దృష్టిలో పెట్టుకొని రోడ్లు పూర్తిచేయాలని మధురవాడ సీపీఐ పార్టీ తరుపున  సెక్రటరీ వి సత్యనారాయణ  మహిళా సమాఖ్య నాయకురాలు ఎం ఏ బేగం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు రాజధానులు ప్రకటించారు. అందులో విశాఖ కేంద్రంగా పురపాలిక రాజధాని పెట్టాలని అనుకున్నారు ఇది మాకు సంతోషమే కానీ మధురవాడ ఏరియా లో వర్షం పడితే ఎక్కడ చూసిన గడ్డలు వాగు అలాగే ఉంటాయి మధురవాడ బిజీ కింద ఇవాళ చూస్తే ఏ ఒక్కరు కూడా కాలు పెట్టి వెళ్లే పరిస్థితి లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ స్కూల్ గా చంద్రంపాలెం జడ్పీహెచ్ హైస్కూల్ ని ప్రకటించారు. ఈ స్కూల్ కి ఎప్పుడు వర్షం పడిన ఆ వర్షపు నీటిలో మునిగిపోయి ఉంటది ఈ స్కూల్ ని మధురవాడ ఏరియా లో పెట్టడానికి ఎంతోమంది మహనీయులు  పోతిన సన్యాసి రావు గానీ నాగోతి సింగన్న గానీ వెంకటరమణ బాబు  గానీ  శ్రమించి పోరాడి సాదించారు.ఇప్పటికీ కూడా ఆ స్కూల్ కి వెళ్లే మార్గం పెద్ద పెద్ద చెరువులా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ స్కూల్ పిల్లలు అందరూ చేపలు పట్టే వాళ్ళు తప్ప స్కూలు చదువుకోడానికి వెళ్లినట్టు ఎవరు కూడా కనబడట్లేదు ఇప్పటికైనా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె ఆరో వార్డు కార్పొరేటర్ గా ప్రియాంక గెలిచారు. ఆ వార్డ్ లోనే ఈ స్కూలు ఉండడం దీన్ని ఇప్పటికైనా మీ దృష్టిలో తీసుకొని దీన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాం.మీరు ఎమ్మెల్యేగా 2011లో గెలిచినప్పుడు నగరం పాలెం మీదుగా వెళ్లే రోడ్డును శంకుస్థాపన చేశారు అది ఒక పక్క పూర్తయింది రెండో పక్క అలాగే ఉంది అది కూడా కొంత కొంత భాగం టి డి ఆర్ లో ఇంకా మిగిలిపోయింది. అలాగే నగరంపాలెం లో ప్రజా సమస్యలపై సభజరిగినప్పుడు నగరంపాలెంలో డ్రైనేజీలు శాంక్షన్ అయ్యాయి అని చెప్పారు .దానికి కూడా సచివాలయం సిబ్బంది మిషన్ పెట్టి కాలువలు తవ్వారు సుమారు నాలుగు నెలలు అయింది ఇప్పటికీ పని పూర్తి అవలేదు దీని మీద సచివాలయం సిబ్బందిని అడిగా టెండరు ఇంకా వెయ్యలేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదు ఇప్పటికైనా ఈ ప్రాంతం పై మీరు ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని సిపిఐ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.