జనసేన జనవాణి కార్యక్రమంలో సేవ్ మీసేవ ప్లకార్డుల ప్రదర్శన

జనసేన జనవాణి కార్యక్రమంలో సేవ్ మీసేవ ప్లకార్డుల ప్రదర్శన

విశాఖ:

మీసేవ ఆపరేటర్ల కుటుంబాలని ఆదుకోండి అంటున్న ఏపీ మీసేవ ఆపరేటర్లు.

అధికారులు సీఎం జగన్ దృష్టికి మీసేవ ఆపరేటర్ల సమస్యను తీసుకు వెళ్ళటం లేదని అధికారులు వాళ్ళ మెప్పు కొరకు మీసేవ ఆపరేటర్లపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.


జనసేన అధినేత పవన్కళ్యాణ్ దృష్టికి వెళ్తే తప్పనిసరిగా సీఎం జగన్ దృష్టికి వెళ్తుందని సమస్య పరిష్కారమఉతుందని ఆశతో జనవాణి కార్యక్రమం కి వచ్చామని తెలిపిన మీసేవ ఆపరేటర్లు.

ఆదివారం పోర్ట్ స్టేడియం లో జరగవలసిన జనసేన జనవాణి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మీసేవ అసోసియేషన్ సభ్యులు అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో నాగు, నాగేశ్వరరావు తదితర మీసేవ ఆపరేటర్లు సేవ్ మీసేవ అను ప్లేకార్డులు ప్రదర్శించారు.రాష్ట్ర మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నాయకులు అధికారి రవికుమార్ మాట్లాడుతూ జనసేన జనవాణి లో పవన్కళ్యాణ్ ని కలిసి మీసేవ సమస్యను పరిష్కరించేవిధంగా చూడాలని అర్జీని ఇచ్చి విజ్ఞప్తి చెయ్యటానికి వచ్చామని కానీ అనువార్యకారణాలతో జనవాణి రద్దు చేయటంతో నిరాశతో వెనుతిరుగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.