అబ్దుల్ కలాం ఆశయాలను పాటిస్తా:కిల్లాన పోలినాయుడు

అబ్దుల్ కలాం ఆశయాలను పాటిస్తా:కిల్లాన పోలినాయుడు  

భీమిలి అక్టోబర్ 15 వి న్యూస్ ప్రతినిధి

మహా విశాఖ, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం జీవీఎంసీ జోన్ టు పరిధిలోని చంద్రం పాలెం ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అయన జయంతి పురస్కరించుకుని పోలినాయుడు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాలను పాటిస్తానని, కలం  అడుగుజాడల్లో నడవడం అబ్దుల్ కలాం ని స్ఫూర్తిగా తీసుకుంటానని పోలినాయుడు తెలిపారు.  

చదువుకోవడానికి ఆసక్తి ఉన్న ఆర్థిక సోమత వల్ల చదవలేక పోతున్న చంద్రంపాలెం పాఠశాలలో చదువుతున్న పిల్లా కరిష్మా అనే విద్యార్థిని పాఠశాల కమిటీ వైస్ చైర్మన్ కిల్లాన పోలినాయుడు   దత్తత తీసుకుని ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని పోలి నాయుడు తెలిపారు. అనంతరం కరిష్మా కు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజబాబు, జయ ప్రధ, ఎర్రి నాయుడు, కె శ్రీనివాస్ రావు పి దేవుడు బాబు, జి ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.