మిస్సైల్ మ్యాన్ 'కలాం' కు ఘన నివాళులు
భీమిలి వి న్యూస్ అక్టోబర్ 15
అద్భుత మేధావిగా, మిస్సైల్ మాన్ గా పేరు గాంచిన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి ని వేములవలస లో వేడుకగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్. కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం కలాం గా అభివర్ణించారు. క్రమశిక్షణకు మారుపేరే కాకుండా అంకితభావం, అకుంఠిత దీక్ష, అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టినప్పటికీ ఎవరి వద్ద ఏమీ ఆశించకుండా ప్రజాసేవే పరమావధిగా భావించిన కలాం ను నేటి తరం నాయకులు, అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. డాబు, దర్పం ప్రదర్శించకుండా అతని వ్యవహార శైలి ఉండేదని అదే అతనికి పేరు తెచ్చి పెట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆర్థిక సహాయం తో సమకూర్చిన విద్యా సామాగ్రిని నిరుపేద విద్యార్థులకు అందజేశారు. అబ్దుల్ కలాం ను గుర్తు చేసుకుంటూ పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.