డైనోసార్ గుడ్లను కనుగొన్న శాస్త్రవేత్తలు.

డైనోసార్ గుడ్లను కనుగొన్న శాస్త్రవేత్తలు.

చైనా:

జెయింట్ క్రిస్టల్‌తో నిండిన రెండు డైనోసార్ గుడ్లను కనుగొన్న శాస్త్రవేత్తలు

చైనాలో రెండు జెయింట్ క్రిస్టల్‌తో నిండిన డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్తగా కనుగొనబడిన గుడ్లు డైనోసార్ కొత్త జాతికి చెందినవని భావిస్తున్నారు. కాల్సైట్ స్ఫటికాల సమూహాలతో నిండిన ఫిరంగి పరిమాణంలో ఉన్న డైనోసార్ గుడ్లను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రెండు శిలాజ గుడ్లు చైనాలో అన్హుయ్ ప్రావిన్స్‌లోని కియాన్‌షాన్ బేసిన్‌లో కనుగొనబడ్డాయి. ఈ అద్భుతమైన ఆవిష్కరణను చైనీస్ నిపుణులు కొత్త పరిశోధనా పత్రంలో వివరించారు. ఇది జర్నల్ ఆఫ్ పాలియోజియోగ్రఫీలో ప్రచురించబడింది.

రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లు క్రెటేషియస్ కాలం నాటివి – డైనోసార్ల యుగం చివరి కాలం నాటివని.. అవి కొత్త డైనోసార్ జాతికి చెందినవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుడ్ల పెద్ద పరిమాణం, గుడ్డు షెల్ యూనిట్ల గట్టి అమరిక, అలాగే వాటి ప్రత్యేకమైన గోళాకార ఆకృతిని బట్టి దీనిని కనుగొన్నారని పాలియోంటాలజిస్టులు వివరించారు. ఇంకా, నిపుణులు వాతావరణ ప్రభావాల కారణంగా, కొత్తగా కనుగొన్న డైనోసార్ గుడ్లలో గుడ్డు పెంకులు, సంబంధిత ద్వితీయ గుడ్డు షెల్ యూనిట్లు భద్రపరచబడలేదని వివరించారు.

గుడ్లలో ఒకటి పాక్షికంగా దెబ్బతిన్నదని, అందువల్ల దాని అంతర్గత సమూహాలలో ఉన్న కాల్సైట్ స్ఫటికాలు బయటపడ్డాయని వారు తెలియజేశారు. రెండూ దాదాపు గోళాకారంలో ఒక్కొక్కటి వరుసగా పొడవు 4.1 అంగుళాలు, 5.3 అంగుళాలు ఉండగా.. వెడల్పు 3.8 అంగుళాలు, 5.2 అంగుళాల మధ్య ఉంటాయి. ఇది ఫిరంగి బంతికి సమానమైన పరిమాణంలో ఉంటుంది. పరిశోధకుల ప్రకారం, గుడ్లు షిక్సింగూలిథస్ కియాన్‌షానెన్సిస్ అని పిలువబడే కొత్త జాతిని సూచిస్తాయి. కొత్తగా కనుగొన్న గుడ్లు ఆర్నిథోపాడ్‌లకు చెందినవని వారు వెల్లడించారు. అంటే చిన్న, మొక్కలను తినే బైపెడల్ డైనోసార్‌లు.