వినాయక ఉత్సవాలు ప్రారంభించిన నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం:విశాఖ లోకల్ న్యూస్
మండలంలోని వేములవలస గ్రామంలోని యువత ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి ప్రతిష్టాపన చేసి ఉత్సవాలను స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవడం చాలా శుభపరిణామమని అన్నారు. విందులు, వినోదాల పేరుతో నూతన పోకడలకు పోకుండా ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడం తనకు ఎంతో ఆనందదాయకం గా ఉందని అభినందించారు. అందరూ వేములవలస యువతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బోధ నారాయణ అప్పుడు, కోరాడ మహేష్, బోధ అప్పలరాజు, తాటి జగదీష్, కోరాడ గణేష్, అరవింద్, శ్యామ్ కుమార్, జీవన్, తరుణ్, పతివాడ రవి, కొట్యాడ శ్రీను, చందక గణేష్ తదితరులు పాల్గొన్నారు.