బింద్రా నగర్ రోడ్డు లో గల షిపియార్డ్ కోలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్న అవంతి
మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
మధురవాడ ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తూ, భీమిలి నియోజక వర్గం వ్యాప్తంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం కొనసాగుతోంది. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు.గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 7వ వార్డు పరిధి బింద్రా నగర్ రోడ్డు లో గల షిపియార్డ్ కోలనీ తదితర ప్రాంతాల్లో భీమిలి నియోజక వర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలను,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
బుక్‌లెట్‌లు పంపిణీ చేసి వారి కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని తెలియపరిచారు. ప్రతి గడపలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, నీటి సమస్య, వీధి దీపాలు ఏర్పాటు వంటి వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను,ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని 7వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు పరిసర వాసులకు వివరించారు.కొత్తగా మంజూరైన వివిద పెన్షన్లను లబ్దిదారులకు అవంతి శ్రీనివాస్ అందజేశారు.భీమిలి నియోజక వర్గం వ్యాప్తంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం కొనసాగుతోంది. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 7వ వార్డు పరిధి బింద్రా నగర్ రోడ్డు లో గల షిపియార్డ్ కోలనీ తదితర ప్రాంతాల్లో భీమిలి నియోజక వర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి ముత్తంశెట్టి మహేష్, జోన్ 2 జెడ్.సి బొడ్డేపల్లి రాము,చెన్నాదాస్, సింహాచల దేవస్థానం బోర్డు మెంబర్ పిళ్ళా కృష్ణమూర్తి పాత్రుడు,5,6,7 వార్డుల అద్యక్షులు పోతిన హనుమంతు,బొట్ట అప్పలరాజు,పోతిన శ్రీనివాసరావు, పిల్లా సూరిబాబు,వాండ్రసి. రవి కుమార్,జగుపల్లి నరేష్ నూకవరపు బాబ్జి,బంగారు ప్రకాష్, అప్పన్న,మొజ్జాడ రమణ మూర్తి,చేకూరి రజని మొజ్జాడ జ్యోతిర్మయి,తమ్మినేని వరలక్ష్మి,నల్ల నాగరత్నం,దాసరి భాను,కె శ్రీదేవి ,ఆశాజ్యోతి,వాసు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.