ఆసుపత్రి ఆవరణలో ప్రధాన రహదారిపై నిలిపిన వాహనాలకు అపరాధ రుసుము?

ఆసుపత్రి ఆవరణలో ప్రధాన రహదారిపై నిలిపిన వాహనాలకు అపరాధ రుసుము?

వెంకోజీపాలెం:

నగరంలో ఉన్న అతి పెద్ద ఆసుపత్రి లో ఒకటి అయిన మేడికవర్ ఆసుపత్రి సమీపంలో నో పార్కింగ్ ప్రదేశంలో నిలిపివేసిన వాహనాలు అంటు రెచ్చిపోతున్న పోలీసులు అయితే ఆసుపత్రి కి బాధలతో వచ్చి ఆసుపత్రి ముందు పార్కింగ్ చేసి ఆసుపత్రి లోకి వెళ్తున్న రోగులుకు మరియు రోగులను చూసేందుకు వస్తున్న రోగుల బంధువులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది...నామమాత్రంగా ఒక నో పార్కింగ్ బోర్డ్ పెట్టేసి అక్కడ ఉన్న వాహనాలపై అపరాధ రుసుము వేస్తూ బీద వాడికి చుక్కలు చూపిస్తున్నారు...అప్పటికే ఆసుపత్రిల్లో వేల కొద్దీ డబ్బులు పెట్టుకొని తమ వారిని కాపాడుకోవాలి అని హాస్పిటల్ కు వస్తున్న రోగుల కుటుంబికులకి మరియు వారి బంధువులకు పోలీస్ సిబ్బంది షాక్లు ఇస్తున్నారు.అయితే దీనిపై పోలీస్  సిబ్బంది  అపరాధ రుసుము విధించే విధంగా కాకుండా ఆసుపత్రి యజమానులుతో మాట్లాడి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ను నియమించి అక్కడ వాహనాలు నిలుపుదల చేయరాదని అది నో పార్కింగ్ ప్రదేశమని చెప్తూ అవగాహన కల్పిస్తే బాగుంటుందని కొందరు స్థానికులు చెపుతున్నారు. పోలిస్ సింబ్బది కూడా తరచు ఇటువంటి  వాటిపై దృష్టి సారించారని తమకు నచ్చినప్పుడు ఎదో ఒకసారి వచ్చి అపరాధ రుసుము విధించడం సరైన పద్ధతి కాదని వహణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1932 మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం ఒక మోటర్ సైకిల్ కు కానీ వాహనం కు కానీ అపాలన్న లేదా అపరాధ రుసుము  వేయాలన్న ఏ ఎస్ ఐ అధికారులు ఉండాలి. హోమ్ గార్డు, కానిస్టేబుల్ అపరాధ రుసుము విధించటానికి వీలు లేదని అంటున్నారు.