విద్యుత్ షాక్కు గురై వివాహిత మృతి
ఆనందపురం:
ఆనందపురం సెప్టెంబర్ 13: మండలంలోని తర్లువాడ ఓ వివాహిత విద్యుత్ షాక్కు గురై మంగళవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి .తర్లువాడ గ్రామానికి చెందిన సిమ్మ గౌరి (29) మంగళవారం మేడ మీద ఆరబెట్టిన బట్టలను తీయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ వైరు తాకడంతో షాక్ కి గురై అక్కడికక్కడే మృతి చెందింది. వివాహితకు భర్త అప్పారావు కుమార్తె స్వాతి, కుమారడు హేమంత్ ఉన్నారు. గౌరీ మామ సిమ్మ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును సి ఐ రామచంద్ర రావు ఆధ్వర్యంలో ఎస్ఐ నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.

.jpeg)