ఆధ్యాత్మిక చింతన అవసరం. ప్రతీ ఒక్కరూ సన్మార్గంలో నడవాలి
విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి.
ఆధ్యాత్మిక జీవితానికి "ఆలయం" అవసరం
వైఎస్సాఆర్సీపీ సియర్ నాయకులు గొలగాని శ్రీనివాసరావు
టైలర్స్ కోలనీలో అంబరానంటిన కలశ యాత్ర
భక్తి శ్రద్దలతో అమ్మవారి పల్లకీ సేవ
గాయత్రీ దేవిగా దర్శమనిమిచ్చిన అమ్మవారు.
(విశాఖపట్నం - సెప్టెంబర్ 28): నేటి పోటీ ప్రపంచంలో వ్యతిరేక ,ప్రతికూల ఆలోచనలు అధికం అవుతుండడంతో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని ,ఆధ్యాత్మిక చింతనను ప్రతిఒక్కరూ పెంపొందించుకోవాలని విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి అన్నారు . విశాఖ నగరంలోని మధురవాడ ,టైలర్స్ కోలనిలో వేంచేసి యున్న శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం పల్లకీ ఉత్సవం ,కలశ యాత్ర కార్యక్రమానికి మేయర్ దంపతులు ముఖ్య అతిదులుగా పాల్గొన్నారు . ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు,లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను ఉద్దేశిస్తూ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ నేటి సమాజంలో అలుపెరగని జీవన యానాన్ని కొనసాగిస్తున్నామని వీటి నుండి బయట పడేందుకు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అన్నారు . ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన రోజురోజుకి పెరుగుతూనే ఉందని దీనిని సన్మార్గాల వైపునకు ఎంతో అవకాశం ఏర్పడుతుందని వివరించారు . అమ్మవారి కరుణాకటాక్షాలు విశాఖ నగర ప్రజలపై ఉండాలని ,నగరాభివృద్ధి తో పాటుగా రాష్ట్రం అభివృద్ధి చెందేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని లోకమాతను ప్రార్ధించారు . ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న ఆలయదర్మకర్తలు బంగారు సుబ్బారావు , లక్ష్మీ దంపతుల సేవలను కొనియాడారు .
ఆధ్యాత్మిక జీవితానికి ఆలయం అవసరం : వైఎస్సాఆర్సీపీ సియర్ నాయకులు గొలగాని శ్రీనివాసరావు
ఆధ్యాత్మిక జీవితంలో ప్రజలందరూసుఖసంతోషాలతో తులతూగాలంటే ఆలయం ఉండాలని వైఎస్సాఆర్సీపీ సియర్ నాయకులు గొలగాని శ్రీనివాసరావు అన్నారు . విజయదుర్గా దేవి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఊరు ,దేశం ,బాగుపడాలంటే ప్రతీ ఊరిలో బడి,గుడి తప్పనిసరిగా ఉండాలన్నారు . గ్రామంలో ప్రజలందరూ ఐక్యంగా ఉంచే స్థావరాలు ఏవైనా ఉన్నాయంటే అవి దేవాలయం,విద్యాలయం మాత్రమే అన్నారు . అందరిని ఆధ్యాత్మిక మార్గంలో
నడిపిస్తున్న ఆలయ ధర్మకర్త మండలి సభ్యులను ప్రశంసించారు .
అంబరానంటిన కలశ యాత్ర..పల్లకీ సేవ ..
శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు .బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా అమ్మవారి కలశ యాత్ర ,పల్లకీ సేవ నిర్వహించారు . అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళ వాయిధ్యాల మధ్య పురవీధుల్లో పల్లకీ సేవ,కలశ యాత్రను నిర్వహించారు . అంగరంగ వైభవంగా బయలుదేరిన అమ్మవారి పల్లకీ సేవ చేయడానికి భక్తులు పోటీ పడ్డారు. మహిళలు అడుగడుగునా మంగళహారతులతో ఘన స్వాగతం పలికి కలశాలు ఎత్తుకొని పల్లకీ ఉత్సవం వెనుక అమ్మవారి నామస్మరణతో నడిచారు. కార్యక్రమానికి ముందుగా నగర మేయర్ దంపతులు శ్రీనివాసరావు ,హరివెంకట కుమారిలు దీపారాధన గావించి పల్లకీ సేవను ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్ ,బంగారు అశోకు కుమార్ ,బంగారు ఝాన్సీ ,తెంటు అజయ్ కుమార్ ,తెంటు మాధవి ,సిటీ కనెక్ట్ ఛైర్మెన్ లంకలపల్లి ఆనంద కుమార్ ,వైఎసార్సీపి నాయకులు ,కనక మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ వంకాయల మారుతీ ప్రసాద్,సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కృష్ణమూర్తి పాత్రుడు,రాజేశ్వరి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వట్టికుల నాగమ్మ,రజని, అప్పన్న, పాపారావు,వరలక్ష్మి,శివారెడ్డి,ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యవర్గ సభ్యులు కర్రి సత్యనారాయణ, ఎల్లాజిరావు తదితరులు పాల్గొన్నారు


