జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు కు శుభాకాంక్షలు తెలియజేసిన 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ:
మధురవాడ : జీవీఎంసీ నూతన కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పి.రాజబాబు కు 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత,టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈసందర్భంగా కార్పొరేటర్ హేమలత 5వ వార్డులోని ముఖ్య సమస్యలను, కొండవాలు ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని,రాజీవ్ గృహకల్పలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, కుళాయిలు,వీధి దీపాల సమస్య,డంపింగ్ యార్డ్ కు అతి దగ్గరగా ఉన్న వార్డ్ కావున మా వార్డ్ పై ప్రత్యేకంగా దృష్టిసారించి శాశ్వత పరిష్కారం చూపాల్సిఉందని వివరించారు.మౌళిక వసతుల కల్పనకు సహకరించి 5వ వార్డ్ అభివృద్ధికి తోడ్పడాలని హేమలత కోరారు.

