చిట్టిలు వేసేవారు చిట్టి నిర్వహుకులతో జర జాగ్రత్త!
తెనాలి:
తెనాలిలో చీటీ పాటల నిర్వహకుడు రూ. 2. 50 కోట్లకు టోకరా ....చేసేది ఏమిలేక బాధితులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు తెనాలి: తేలప్రోలులో చీటీ పాటల నిర్వహకుడు రూ. 2. 50 కోట్లకు టోకరా ఇచ్చాడు. అహ్మద్ లబ్(మస్తాన్) 20 ఏళ్లుగా చీటీ పాటలు నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా పాటదారులకు చెల్లింపులు జరపకుండా నిలుపుదల చేసి రేపో మాపో అంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. కాగా రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. సుమారు100 మందికి పైగా రూ. 2.50 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. బాదితులు పోలీసులను ఆశ్రయించారు.